దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్‌ విన్యాసాలు: ‘క్రిమినల్‌ కేసు నమోదు’

28 Sep, 2021 14:59 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడలో బైక్‌ రేసర్లు రెచ్చిపోయారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్‌లకు పాల్పడుతూ వాహనదారులకు దడపుట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. ఈ బైక్ స్టంట్స్‌పై ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్ సాక్షి టీవీతో మాట్లాడారు.

‘‘మైనర్ విద్యార్థులు ఫ్లైఓవర్‌పై విన్యాసాలు చేస్తున్నారు.. ఇవి అత్యంత ప్రమాదకరం. గత ఏప్రిల్‌లో ఐదుగురు విద్యార్థులును పట్టుకున్నాం. తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చాం. తాజాగా దుర్గగుడి ఫ్లైఓవర్‌సై స్టంట్లు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. 
(చదవండి: చెన్నైలో ఆటో రేసింగ్‌.. ఒళ్లు గగుర్పొడవడం ఖాయం)

‘‘ఇద్దరు యువకులు స్టంట్లు చేసినట్టు గుర్తించాం. యువకులు టాయ్ గన్ తో విన్యాసాలు చేశారు. బైక్ రేసులు, విన్యాసాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. బైక్ రేసులు, స్టంట్లు చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నాం. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విజువల్స్ చూశాం. ఇప్పుడు వచ్చిన విజువల్స్‌లో ఉన్న యువకుడిని కూడా అదుపులోకి తీసుకుంటాం. రేసింగ్, స్టంట్లు చేసిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇక నుంచి ఖాళీ రోడ్లు, ఫ్లై ఓవర్లపై నిఘా పెడతాం. యువకుల చేతిలో ఉన్నది డూప్లికేట్ గన్‌గా నిర్ధారించాం’’ అన్నారు. 

చదవండి: Hyderabad Bike Racer: రికార్డులే రికార్డులు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు