పెళ్లి ఊరేగింపులో విషాదం...వధువు తల్లిని కత్తితో పొడిచి...

13 May, 2022 19:27 IST|Sakshi

Two neighbours of the bride’s family Assaassinated Her Mother: ఇటీవల చిన్నచిన్న వాటికే హత్యలు వరకు వెళ్లిపోతున్నారు. క్షణికావేశంలో ఘోరమైన నిర్ణయాలు తీసుకుని జీవితాలను బలిచేసుకుంటున్నారు. దీంతో సరదాగా చేసుకునే పండుగలు, వేడుకలు విషాదాంతమవుతున్నాయి. చిన్నచిన్న వాటికే అలిగి అర్థంకానీ ఆవేశంతో చేసే పనులు వారిని, వారి బంధువులను అపకీర్తీ పాలు చేస్తోంది. అచ్చం అలాంటి ఘటనే ఒడిశాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే....ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో జరిగిన వివాహ వేడుకు విషాదంగా మారింది. పెళ్లకొడుకు తరుపు వారు రష్మీ రాజాన్స్‌ పెళ్లి కోసం బార్‌ఘర్‌ జిల్లాలోని సలేపాలి గ్రామానికి పెద్ద ఊరేగింపుగా వచ్చారు. ఆ ఊరేగింపులో వధువు తరుపు పొరుగింటివాళ్లు ఇద్దరు జాయిన్‌ అయ్యి డ్యాన్స్‌లు చేస్తున్నారు.

అయితే ఆ ఊరేగింపులో డ్యాన్స్‌లు చేస్తూ పెళ్లి కొడుకు తరుపు వారిని ఇబ్బందికి గురిచేస్తున్నారు. దీంతో వధువు తల్లి అభ్యంతరం చెప్పడమే కాకుండా డ్యాన్స్‌లు చేయొద్దని సూచించింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ ఇద్దరు వధువు తల్లిని కత్తితో పొడిచి హత్య చేశారు. తదనంతరం పోలీసుఉల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రారంభించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

(చదవండి: యాత్రికులతో వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం... నలుగురు మృతి)

మరిన్ని వార్తలు