-

మద్యం అక్రమ రవాణా కేసులో బీజేపీ నేత గుడివాక అరెస్ట్‌ 

17 Aug, 2020 05:46 IST|Sakshi
పోలీసుల అదుపులో గుడివాక

సాక్షి, గుంటూరు/సాక్షి, అమరావతి: తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తోన్న బీజేపీ నేత గుడివాక రామాంజినేయులును అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ స్థానానికి బీజేపీ తరఫున పోటీచేసి ఓటమి చెందాడు. గుంటూరు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు పెదకాకాని మండలం కొప్పురావూరు సమీపంలో ఆదివారం తనిఖీలు చేశారు.

తెలంగాణ నుంచి మద్యంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న గుడివాక, మత్సా సురేష్‌ను అరెస్ట్‌ చేసి 20 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో గుంటూరులోని రామాంజినేయులు బినామీ నరేష్‌తో పాటు, గంటా హరీష్‌లను అరెస్టు చేసి 20 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఈబీ ఏఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ మాట్లాడుతూ..నిందితుల నుంచి రూ.6 లక్షల విలువైన 1,920 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా, గుడివాకను పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సస్పెండ్‌ చేసినట్లు బీజేపీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.  

మరిన్ని వార్తలు