‘వివాహేతర సంబంధాలు’! బీజేపీ నేత శ్వేత మృతి కేసులో సంచలన విషయాలు

2 May, 2022 14:01 IST|Sakshi
శ్వేత కుటుంబం (పాత ఫొటో)

బీజేపీ నేత శ్వేతా సింగ్‌ గౌర్‌ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన నీచపు బాగోతం బయటపెడుతుందనే ఉద్దేశంతోనే ఆమె భర్తే ఆమెను హత్య చేసి.. అత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాడంటూ ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే శ్వేత భర్తను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 

ఉత్తర ప్రదేశ్‌ బండాకు చెందిన జిల్లా పంచాయితీ సభ్యురాలు, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్వేతా సింగ్‌ గౌర్‌.. బుధవారం తన ఇంట్లో శవమై కనిపించారు. తన భర్త, బీజేపీ నేత దీపక్‌ గౌర్‌ ఇన్‌వాల్వ్‌ అయిన ఇంటర్నేషనల్‌ సె* రాకెట్‌కు సంబంధించి ఆడియో కాల్స్‌ ఆమె రికార్డు చేసిందని, ఆ భయంతోనే ఆమె బిక్కుబిక్కుమంటూ గడిపిందని శ్వేత కుటుంబం ఆంటోంది. అందుకే తమ బిడ్డను హత్య చేశారని, ఇందులో దీపక్‌తో పాటు అతని తండ్రి, తల్లి, అన్న.. అంతా ఇన్‌వాల్వ్‌ అయ్యారని ఆరోపిస్తోంది. ఈ మేరకు ఫిర్యాదు ఆధారంగా దీపక్‌ కుటుంబంపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు పోలీసులు.
  

నీచపు పని
రష్యా, మొరాకో, ఆఫ్రికా అమ్మాయిలతో కూడిన వ్యభిచార ముఠాలతో దీపక్‌ లావాదేవీలు జరిపాడని శ్వేత కుటుంబం ఆరోపిస్తోంది. తన భర్త విటులను సంప్రదించిన ఫోన్‌ కాల్స్‌ను శ్వేత రికార్డు చేసిందని, ఇందుకు సంబంధించి ఫొటోలు, డబ్బు పంపిన వ‍్యవహారాలను సైతం ఆమె సేకరించింది. ఈ మేరకు మూడు సంభాషణలకు సంబంధించిన ఆడియో క్లిప్స్‌ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. అంతేకాదు.. లక్నోలోని ఎంజే ఇంటర్నేషనల్‌ హోటల్‌ను అడ్డాగా మార్చుకుని రాసలీలలకు దిగాడని శ్వేత తమతో చెప్పిందని ఆ కుటుంబం అంటోంది.  తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆమెను హత్య చేశాడని, సీలింగ్‌కు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని శ్వేత కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు తమ బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ పూర్తి ఆధారాలను యూపీ పోలీసులకు అప్పగించింది ఆ కుటుంబం.

పరువు పోకూడదని అమ్మ భరించింది
దీపక్‌కు పలువురు మహిళలతోనే వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలో ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయని వీళ్ల ఇద్దరు కూతుళ్లు చెప్తున్నారు.  అంతేకాదు ఇద్దరు ఆడపిల్లలు కావడంతో తమ తండ్రికి మరో వివాహం చేయాలని.. ఆయన కుటుంబం ప్రయత్నించిందని వాళ్లు అంటున్నారు. ఈ విషయమై చాలాసార్లు తమ తల్లి(శ్వేత) మీద దాడి జరిగిందని, కానీ పరువు పోకూడదనే ఉద్దేశంతో ఆమె ఇంతకాలం భరిస్తూ వచ్చిందని ఆ ఇద్దరు కూతుళ్లు అంటున్నారు. అదే టైంలో రాజేష్‌ అనే వ్యక్తి పేరిట.. దీపక్‌-శ్వేతల మధ్య ఓ వీడియో వైరల్‌ కావడం విశేషం. 

చదవండి: తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం..

మరిన్ని వార్తలు