టికెట్‌ కోసం బీజేపీ నాయకురాలి ఆత్మహత్యాయత్నం 

19 Nov, 2020 17:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : త్వరలో జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో టికెట్‌ రాలేదని బీజేపీ నాయకురాలు విజయలలితా రెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. నాచారం డివిజన్‌ బీజేపీ నాయకురాలైన విజయలలితా రెడ్డి నాచారం టికెట్‌ ఆశించారు. టికెట్‌ రాకపోవటంతో మనస్తాపానికి గురయ్యారు. గురువారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో అనుచరులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తనకు టికెట్‌ రాకుండా చేశారని ఆమె ఆరోపించారు. కాగా, బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మొదటి జాబితాను ఇది వరకే విడుదల చేసింది. 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 

బీజేపీ అభ్యర్థులు.. 
పత్తర్‌గట్టి– అనిల్‌బజాజ్‌(ఓసీ); మొగుల్‌పుర– మంజుల(ఓసీ); పురానాపూల్‌– సురేందర్‌కుమార్‌(బీసీ); కార్వాన్‌– కె.అశోక్‌(బీసీ); లంగర్‌హౌస్‌– సుగంద పుష్ప(బీసీ); టోలిచౌకి– రోజా(బీసీ); నానల్‌నగర్‌– కరణ్‌కుమార్‌(బీసీ), సైదాబాద్‌– కె.అరుణ(ఓసీ); అక్బర్‌బాగ్‌– నవీన్‌రెడ్డి(ఓసీ); డబీర్‌పుర– మిర్జా అఖిల్‌ అఫండి(మైనార్టీ); రెయిన్‌బజార్‌– ఈశ్వర్‌ యాదవ్‌(బీసీ); లలితాబాగ్‌– చంద్రశేఖర్‌(ఎస్సీ); కుర్మగూడ– శాంత(బీసీ); ఐఎస్‌ సదన్‌– జంగం శ్వేత(ఓసీ); రియాసత్‌నగర్‌– మహేందర్‌రెడ్డి(ఓసీ); చాంద్రాయణగుట్ట– నవీన్‌కుమార్‌(బీసీ); ఉప్పుగూడ– శ్రీనివాసరావు(బీసీ); గౌలిపుర– భాగ్యలక్ష్మీ(బీసీ); శాలిబండ– నరే ష్‌(బీసీ); దూద్‌బౌలి– నిరంజన్‌కుమార్‌(బీసీ); ఓల్డ్‌ మలక్‌పేట్‌– రేణుక(బీసీ).

మరిన్ని వార్తలు