బీజేపీ ఎంపీ కొడుకుపై కాల్పులు

3 Mar, 2021 09:38 IST|Sakshi

ఛాతీపై కాల్పులు జరిపి పరారైన దుండగులు

ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

లక్నో : బీజేపీ ఎంపీ కౌషల్ కిషోర్ కుమారుడు ఆయూష్‌ (౩౦)పై బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతిరోజూ లానే ఉదయం నడకకు వెళ్లిన ఆయూష్‌పై మదీయవా ప్రాంతంలో  బైక్ వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో ఆయూష్‌ ఛాతిపై బుల్లెట్‌ గాయం అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. 

ఎంపీ కౌషల్ కిషోర్ లాల్గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన భార్య జై దేవి.. మాలిహాబాద్ ఎమ్మెల్యే. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటివరకు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దాడి వెనుక ఎవరున్నారు అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అయితే ఆయూష్‌కు గతంలో కొంతమంది వ్యక్తులతో శతృత్వం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 

చదవండి : (ఎమర్జెన్సీ విధించడం తప్పే: రాహుల్ ‌గాంధీ)
(చిన్నమ్మ కొత్త వ్యూహం.. మూడో కూటమిలోకి నో ఎంట్రీ!)
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు