యువ బాడీబిల్డర్‌ దారుణ హత్య 

10 Apr, 2021 08:17 IST|Sakshi

యశవంతపుర: చిక్కమగళూరు నగరంలో బాడీ బిల్డర్‌ హత్యకు గురయ్యాడు. మను (21)పై గుర్తు తెలియని దుండగులు బుధవారం దాడి చేశారు. గురువారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందారు. హిందూ సంఘాల కార్యక్రమాల్లో ఇతడు చురుగ్గా పాల్గొనేవాడు. పోలీసులు ఒక అనుమానితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. త్వరలో జరిగే మిస్టర్‌ చిక్కమగళూరు బాడీ బిల్డింగ్‌ పోటీలకు సిద్ధమవుతున్న సమయంలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను ఖండిస్తూ నగరంలోని ఎంజీ రోడ్డులో వ్యాపారులు షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. హంతకులను అరెస్టు చేయాలని హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన చేశారు.     

బాలిక ఆత్మహత్య 
మైసూరు: ఉగాది పండగకు కొత్త దుస్తులు కొనివ్వలేదని బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల పట్టణ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. నాయుడితోట వద్ద బసవరాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈయనకు హర్షిత(12)అనే కుమార్తె ఉంది. ఉగాది పండగకు కొత్త దుస్తులు కొనాలని తల్లిదండ్రులను అడిగింది.  జీతం వచ్చిన తరువాత ఇంట్లోవారందరికీ దుస్తులు కొనిస్తానని తండ్రి చెప్పాడు. దీంతో మనోవేదనకు గురైన బాలిక ఇంటిలో ఉరివేసుకుంది.

చదవండి: తీరని శోకం: నీటికుంటలో మృత్యుఘోష
పురుగుల మందు తాగి ఉద్యోగిని ఆత్మహత్య 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు