పాక్‌లో బాంబు పేలుడు: నలుగురు మృతి

22 Apr, 2021 08:13 IST|Sakshi

పాకిస్థాన్‌: నైరుతి పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో ఉన్న ఓ హోటల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. హోటల్‌ కారు పార్కింగ్‌ స్థలంలో బాంబు పేలింది.

ఈ ఘటనపై స్పందించిన పాక్‌ హోంశాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్,  నలుగురు మరణించినట్లు తెలిపారు. ఈ హోటల్‌లో చైనా రాయబారులకు ఆతిథ్యమిచ్చినట్లు తెలిపారు. ఈ బాంబు పేలుడు ఘటనను ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఎవరు ముందుకు రాకపోవడం గమనార్హం.
చదవండి: ఉన్నట్టుండి పేలిన ఫోన్‌, షాకైన జనం: వైరల్‌ వీడియో

మరిన్ని వార్తలు