అక్షయ్‌ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ

13 Jan, 2021 10:08 IST|Sakshi

ఐటీ అధికారులుగా ఎలా నటించాలనే దానిపై శిక్షణ

శ్రీనగర్‌ కాలనీలోని ఓ సినిమా కంపెనీ నుంచి ఐటీ అధికారుల డ్రెస్‌లు అద్దెకు

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అఖిలప్రియ అండ్‌ గ్యాంగ్‌ సినిమా తరహాలో కిడ్నాప్‌కు ప్లాన్‌ చేసింది. భార్గవ్ సోదరుడు చంద్రహాస్ కిడ్నాప్‌కు ముందు అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ 26’ అనే సినిమాని అఖిలప్రియ అండ్‌ గ్యాంగ్‌కు చూపెట్టాడు. అలానే ఐటి అధికారులుగా ఎలా నటించాలి అనే దానిపై వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిసింది. యూసుఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్‌లో చంద్రహాస్‌, అఖిలప్రియ అండ్‌ గ్యాంగ్‌కి కిడ్నాప్‌కు సంబంధించి శిక్షణ ఇచ్చాడు. ఇక అఖిలప్రియ ఆదేశాలకు అనుగుణంగానే అక్షయ్ కుమార్ సినిమా చూపెట్టి కిడ్నాప్ చేయించినట్లు భార్గవ్, చంద్రహాస్ తెలిపారు. అలానే ఐటి అధికారుల చెకింగ్ డ్రెస్సులు, ఐడి కార్లను చంద్రహాస్‌ తయారు చేశాడు. శ్రీ నగర్ కాలనీలోని ఒక సినిమా కంపెనీ నుంచి ఐటి అధికారుల డ్రెస్‌లను వీరు అద్దెకు తీసుకున్నారు. (చదవండి: పోలీసుల అదుపులో భార్గవ్‌రామ్‌!?)

మరిన్ని వార్తలు