అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌తో పాటు అతడు కూడా

13 Jan, 2021 18:39 IST|Sakshi
భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌, జగత్‌విఖ్యాత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి కారు డ్రైవర్‌ అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా.. కిడ్నాప్‌లో జగత్‌విఖ్యాత్‌కు ప్రమేయం ఉన్నట్లు అతడు వెల్లడించినట్లు సమాచారం. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌తో పాటు అతడు కూడా.. బాధితుడు ప్రవీణ్‌రావు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులమంటూ.. వారిని బెదిరించినట్లు సమాచారం. వీరిద్దరు స్పాట్‌లో ఉండగా... లోథా అపార్ట్‌మెంట్‌లో ఉన్న అఖిలప్రియ ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే విధంగా కిడ్నాప్‌ తర్వాత.. భార్గవ్‌, జగత్‌విఖ్యాత్‌ ఒకే వాహనంలో వెళ్లినట్లు కూడా విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగత్‌ విఖ్యాత్‌ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: అక్షయ్‌ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ)

మూడోరోజు విచారణ.. 300 ప్రశ్నలు
ఈ కేసులో నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియ మూడోరోజు విచారణ ముగిసింది. ఈ క్రమంలో.. ఆమె భర్త భార్గవ్‌రామ్‌ సొంత పాంహౌజ్‌లో.. బాధితుల నుంచి సంతకాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు అఖిలప్రియకు 300 ప్రశ్నలు సంధించిన పోలీసులు.. ఈ కేసులో నిందితులైన భార్గవ్‌రామ్‌, చంద్రహాస్‌, గుంటూరు శ్రీను ఆచూకీపై ఆరా తీశారు. టెక్నికల్‌ సాక్ష్యాలను అఖిలప్రియ ముందు ఉంచటంతో.. పలు ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భార్గవ్‌, గుంటూరు శ్రీను, జగత్‌ విఖ్యాత్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు