బోయిన్‌పల్లి కిడ్నాప్‌: వెలుగులోకి సంచలన విషయాలు

7 Jan, 2021 13:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  బోయిన్‌పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆ వివరాలు.. కొన్నేళ్ల క్రితం భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిలు హఫీజ్ పేట్‌లో భూములు కొనుగోలు చేశారు.  ప్రవీణ్‌రావ్ తండ్రి కిషన్ రావ్.. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. నాగిరెడ్డి బతికి ఉన్న సమయంలో కిషన్‌ రావు కీలకంగా వ్యవహరించారు. భూమా మరణం తర్వాత ఏవీ సుబ్బా రెడ్డి ల్యాండ్ విషయంలో రంగంలోకి దిగారు. ఏవీ ఎస్టేట్స్ పేరుతో ల్యాండ్‌లోకి ప్రవేశించారు. ( బెంగళూరులో ఏ-3 భార్గవరామ్‌? )

ఈ నేపథ్యంలో 2020లో ఏవీ సుబ్బారెడ్డిపై  కేపీ ఎస్టేట్స్ ఓనర్ ప్రవీణ్‌రావ్ ట్రెస్ పాస్ కేసు పెట్టారు. గతంలోనే 50 ఎకరాల భూమిలో చెరో 25 ఎకరాల ల్యాండ్ చెందేట్లు ఏవీ సుబ్బారెడ్డి మీడియేషన్ చేశారు. సెటిల్మెంట్ కూడా జరిగిపోయింది. కానీ, మిగతా 25 ఎకరాలు కూడా తమకే కావాలని ప్రవీణ్‌రావ్‌పై భూమా కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. పక్కా ప్లాన్‌తో కిడ్నాప్‌కు పాల్పడ్డారు.

మరిన్ని వార్తలు