మనీ కోసం మనుమడి ఘాతుకం

9 Jul, 2021 17:45 IST|Sakshi
చికిత్స పొంతున్న అనసూయ

సాక్షి, సిరిసిల్లక్రైం(కరీంనగర్‌): తాగుడుకు బానిసైన యువకుడు డబ్బుల కోసం అమ్మమ్మపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు, వృద్ధురాలు తెలిపిన వివరాలు. సిరిసిల్ల గీతానగర్‌లో వృద్ధురాలు అనసూయ(95) ఒంటరిగా ఉంటుంది. తాగుడుకు బానిసైన తన చిన్నబిడ్డ కొడుకు సంతోష్‌ డబ్బుల కోసం సోమవారం రాత్రి వృద్ధురాలి వద్దకు వచ్చాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన సంతోష్‌ అనసూయ తలపై రాడుతో బాది పరారయ్యాడు.

మంగళవారం తెల్లవారుజామున వృద్ధురాలికి మెలకువ వచ్చి, అరవడంతో స్థానికులు వచ్చి ఈ విషయాన్ని అదే కాలనీలో ఉంటున్న వృద్ధురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం రాత్రి కళ్లు తెరిచిన వృద్ధురాలు అసలు విషయం తెలపడంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. వృద్ధురాలి పెద్దకూతురు ఏవి కళ గురువారం సిరిసిల్ల టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు క్లూస్‌టీంతో కలిసి వృద్ధురాలి ఇంటిలో ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అనిల్‌కుమార్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు