యువతితో మూడేళ్లపాటు ప్రేమ.. వివాహం అనగానే..

19 Aug, 2021 09:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సుల్తానాబాద్‌రూరల్‌(కరీంనగర్‌): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్లు గడుస్తున్నా పట్టించుకోకుండా తిరుగుతున్న ప్రియుడి ఇంటి ఎదుట బుధవారం ఓ యువతి బైఠాయించిన సంఘటన సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది. సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని శ్రీరాములపల్లికి చెందిన చొప్పరి సంజీవ్,అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమాయణం సాగించాడు. యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి పట్టించుకోకపోవడంతో అతడి ఇంటి ఎదుట బైఠాయించింది.

ఇద్దరి కులాలు ఒక్కటికావడంతోపాటు మైనర్లు కాగా  గతంలో ఇరు కుటుంబాలకు తెలిసింది. 2018లో ఇరువురి కుటుంబాలు, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కాగా స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో దండలు మార్చుకున్నారు. ప్రియుడి అన్నకు పెళ్లికాకపోవడంతో ప్రేమికులిద్దరు ఎవరి ఇంట్లో వారే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్ర స్తుతం ప్రియుడి అన్నకు పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి చేసుకోవాలని కోరగా తప్పించుకు తిరుగుతున్నాడని వాపోయింది. ఇప్పటికైనా న్యాయం చేయాలని వేడుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని కౌన్సెలింగ్‌ నిమిత్తం రాణాకు తరలించారు. 

మరిన్ని వార్తలు