దీపావళి రోజు విషాదం.. టపాసులు పేలి 11 ఏళ్ల బాలుడు మృతి

25 Oct, 2022 07:41 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం(కృష్ణా జిల్లా): దీపావళి పండగ రోజు విషాదం చోటుచేసుకుంది. మచిలీపట్నం శివారు నవీన్ మిట్టల్‌ కాలనీలో సీతానగర్‌లో టపాసులు పేలి 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. టపాసులు ఆరబెడుతుండగా అవి ఒక్కసారిగా పేలాయి. దీంతో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనంపై నిప్పులు పడటంతో ట్యాంక్ అంటుకుని వాహనం పేలిపోయింది. దీంతో బాలుడు మంటల్లో చిక్కుకున్నాడు.
చదవండి: టపాసులు కాల్చొద్దు అన్నందుకు హత్య

టపాసులు, బైక్ పేలిన శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు వచ్చిన తల్లిదండ్రులు, స్థానికులు.. బాలుడిని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. దీంతో సీతానగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు