చిన్నారి ప్రాణం తీసిన కొబ్బరిముక్క

5 Dec, 2022 20:40 IST|Sakshi
మణికంఠ (ఫైల్‌) 

సాక్షి, వరంగల్‌: పది నెలల తమ కుమారుడు ఏడుస్తున్నాడని కొబ్బరి ముక్క చేతిలో పెట్టాడు తండ్రి.. కానీ, ఆ కొబ్బరి ముక్క.. ఆ బుడిబుడి మాటల బాలుడి ప్రాణాలు తీసింది. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్దకొర్పోలు శివారు వెంకటతండా జీపి పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తండా వాసులు, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన దరావత్‌ కవిత–మాలు దంపతులు. మాలు అయ్యప్ప స్వామి మాలధారణ చేశాడు.

కాగా, అయ్యప్ప పూజ కార్యక్రమంలో తల్లిదండ్రులు నిమగ్నమై ఉండగా.. తమ కుమారుడు మణికంఠ(10నెలలు) ఏడుస్తుండడంతో కొబ్బరిముక్క ఇచ్చారు. కొబ్బరిముక్క బాబు గొంతులో ఇరుక్కొపొయి నోటి నుంచి నురుగు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నెక్కొండకు తీసుకువస్తున్న క్రమంలో ఊపిరిఆడక బాలుడు మృతి చెందాడు.
చదవండి: నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు