డబ్బు కోసం బాలుని కిడ్నాప్‌ 

5 Jul, 2021 17:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గౌరిబిదనూరు(కర్ణాటక): తాలూకా దేవగానహళ్ళిలోని చౌడమ్మ అనే మహిళ కొడుకు విజేంద్ర (16)ను కిడ్నాప్‌ చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బాలుని తండ్రితో ఈ ముఠాకు ఉన్న ఆర్థిక తగాదాల నేపథ్యంలో అపహరించినట్లు, ఈ ముఠా రైస్‌పుల్లింగ్‌ దందాకు పాల్పడేదని తేలింది. చిక్కబళ్లాపుర ఎస్పీ మిథున్‌కుమార్‌ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. గత నెల 30వ తేదీన ఉదయం 6 గంటల సమయంలో 5 మంది వ్యక్తులు కారులో చౌడమ్మ ఇంటికి వచ్చి భర్త పాపన్న ఎక్కడని అడగ్గా పొలంలో ఉన్నాడని ఆమె చెప్పింది.

పొలానికి దారి చూపాలని ఆగంతకులు అడగ్గా ఆమె కొడుకు విజేంద్రను వారి వెంట పంపింది. దుండగులు బాలున్ని తిరుపతిలోని పాత తిరుచానూరు రోడ్డు­లోని ఒక ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించారు. రూ.2.5 లక్షలు ఇస్తేనే బాలున్ని వదిలేస్తామని చౌడమ్మకు దుండగులు ఫోన్లు చేయసాగారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ మొదలుపెట్టారు. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బాలు­న్ని బంధించిన ఇంటిపై దాడి చేసి  10 గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను అరెస్టు చేశా­రు. నిందితులు పాళ్యం దామోదర్‌ (తిరుపతి), ముత్తంశెట్టి మణికుమార్, వెంకిపాడు గ్రామం కృష్ణా జిల్లా, షేక్‌ భాషా, నూజివీడు, లోకేశ్‌కుమార్, నూజివీడుగా గుర్తించారు. దుండగులు బాలున్ని తీవ్రంగా కొట్టడంతో గాయాలు అయ్యాయి. 

మరిన్ని వార్తలు