17 ఏళ్ల బాలికపై యువకుడి అమానుషం.. ఆ ‍ప్రపోజల్‌ వద్దన్నందుకు..

24 Nov, 2021 20:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌: సాధారణంగా కొంత మంది యువకులు.. యువతుల్ని స్నేహంపేరుతో, ప్రేమపేరుతో వేధిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కొసారి కొంతమంది యువకులు అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు వార్తల్లో చూస్తునే ఉంటాం. తాజాగా, ఇలాంటి ఒక అమానవీయకర సంఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, జైపూర్‌లోని స్థానిక పాఠశాలలో చదువుకుంటున్న 17 ఏళ్ల బాలికను.. ఒక యువకుడు స్నేహంపేరుతో వేధించసాగాడు. స్నేహం చేయాలని ప్రతిరోజు బాలికను ఇబ్బందిపేట్టేవాడు. ప్రతిరోజు బాలికను అనుసరించేవాడు.   ఆ బాలిక మాత్రం యువకుడి స్నేహాన్ని  తిరస్కరించింది.

ఈ క్రమంలో ఆ యువకుడు.. ఒకరోజు బాలిక చదువుకుంటున్న పాఠశాలను చేరుకున్నాడు. ఆ తర్వాత.. బ్లేడ్‌ తీసుకుని ఆమెపై విచక్షణ రహితంగా దాడిచేశాడు. దీంతో ఆమె షాక్‌కు గురై.. గట్టిగా కేకలు వేసింది. బాలిక అరుపులు విని పాఠశాల ఉపాధ్యాయులు అక్కడికి చేరుకున్నారు. ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

రక్తపు మడుగులో కింద పడిపోయి ఉన్న బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు.  బాలిక వాగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. 

మరిన్ని వార్తలు