స్నేహం పేరిట బాలికను ట్రాప్‌ చేసి.. ఆ తర్వాత..

12 Nov, 2021 10:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మిర్యాలగూడ (నల్గొండ): స్నేహం పేరిట బాలికను ట్రాప్‌ చేసిన బాలుడిపై బాధిత కుటుంబం గురువారం షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది. షీటీం ఎస్‌ఐ మాధవిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన బాలుడు తన బంధువుల ద్వారా ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. స్నేహం పేరుతో బాలికకు దగ్గరైన అతడు తరచూ డబ్బులు తీసుకురావాలని ఆమెపై ఒత్తిడి చేస్తుండేవాడు.

దీంతో ఆ బాలిక ఇంట్లో తల్లిదండ్రులు దాచిన రూ.40 వేలు దొంగిలించి అతడికి ఇచ్చింది. ఇటీవల బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు, విషయాన్ని గుర్తించి షీటీంను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన షీటీం సభ్యులు బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతూ రోజుల వ్యవధిలో బాలికను ట్రాప్‌ చేసిన విధానం.. ఇతర వివరాలను రాబట్టారు. అనంతరం ఇరువురికి విడివిడిగా కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు