ఇత్తడి పాత్రకు అద్భుత శక్తి ఉందంటూ.. 

19 Oct, 2020 09:15 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న ఇత్తడి పాత్ర, పోలీసులకు పట్టుబడిన నిందితులు

సాక్షి, రాజేంద్రనగర్‌: ఇత్తడి పాత్రకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని.. ఇంట్లో ఉంచి పూజ చేస్తే కోటీశ్వరులు అవుతారని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని అమాయకులను నమ్మించి అంటగట్టేందుకు యత్నించిన ఓ రైస్‌ పుల్లింగ్‌ ముఠాను శంషాబాద్‌ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్‌ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈమేరకు 14 మంది నిందితులను అరెస్టు చేసి రూ. 1.30 లక్షల నగదు, 16 సెల్‌ఫోన్లు, హోండా యాక్టివా వాహనంతో పాటు ఇత్తడి పాత్రను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఓటీ సీఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. ఇత్తడి పాత్రకు అద్భుత శక్తులు ఉన్నాయని దానిని రూ. 15 లక్షలకు విక్రయిస్తామంటూ ఒక ముఠా రాజేంద్రన గర్‌లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో  రాజేంద్రనగర్‌ పోలీసులతో పాటు ఎస్‌ఓటీ సిబ్బంది తాము కొనుగోలు చేస్తున్నట్లు ముఠా సభ్యులతో సంప్రదింపులు జరిపారు. వారం రోజుల పాటు నిందితులతో మాట్లాడి రూ. 15 లక్షలకు కొంటామని నమ్మబలికారు.

రాజేంద్రనగర్‌ కిషన్‌బాగ్‌ ప్రాంతానికి వచ్చి పాత్రను తీ సుకోవాలని ముఠా సభ్యులు సమాచారం ఇవ్వడంతో రా జేంద్రనగర్‌ పోలీసులు, ఎస్‌ఓటీ సిబ్బంది సంయుక్తంగా దాడి చేశాశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామానికి చెందిన ఏ.శ్రీనివాస్‌గౌడ్, ఎమిగనూ రు గ్రామానికి చెందిన వడ్డె ఇరుకుండ, హన్మకొండ ని వాసి సి.భాస్కర్‌ , బేలగాల గ్రామానికి చెందిన బి.రాములు, నందవరం మండలాని చెందిన బి.జయ రాముడు, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నివాసి ప్రవీణ్‌కుమార్, కుత్బుల్లాపూర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ బిలాల్, మహ్మద్‌ ఆలీమ్‌పాషా, రాజేంద్రనగర్‌ సిక్‌చౌనీ నివాసి కుల్‌దీప్‌సింగ్, ఆసిఫ్‌నగర్‌కు చెందిన సి.రాకేష్, బహదూర్‌పురాకు చెందిన నాగరాజు, దోమలగూడకు నివాసి సంతోష్‌కుమార్, నాంపల్లివాసి మహ్మద్‌ అబ్దుల్‌ హసన్, అత్తాపూర్‌కు చెందిన సర్ధార్‌ డీదర్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

వీరు పద్నాలుగు మంది ఒక ముఠాగా ఏర్పడి అమాయకులను నమ్మించి ఇత్తడిపాత్రను విక్రయించేందుకు ప్రయత్నించారు. ఇత్తడి పాత్రకు ఎలాంటి శక్తులు లేవని, అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు వసూలు చేసుకొని పారిపోతారని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా  పోలీసులు సూచించారు. ఈమేరకు కేసు నమోదు చేసి నిందితులను రాజేంద్రనగర్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.  

పోలీసులకు పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసుకున్న ఇత్తడి పాత్ర  

రెట్టింపు డబ్బులు ఇస్తామని టోకరా 

  • పోలీసులకు ఫిర్యాదు  

యాలాల: ఐదేళ్ల తర్వాత రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గి మండలం తోగాపూర్‌కు చెందిన మ్యాతరి వెంకటేష్‌ ఎస్‌ఆర్‌జీసీ అనే సంస్థలో డబ్బులు పొదుపు చేస్తే ఐదేళ్ల తర్వాత రెట్టింపు ఇస్తామని అప్పట్లో యాలాల మండలంలోని రాస్నం గ్రామంలోని పలువురిని నమ్మించాడు. దీంతో గ్రామానికి చెందిన గాజుల ఖైరూన్‌ బేగం, అబ్దుల్‌ కరీం, షేక్‌ ఖైసర్‌ బాను, గురదోట్ల విజయ్, గాజుల మ హ్మద్‌ ముస్తఫా తదితరులు రూ.25,300 చొప్పున చెల్లించారు. తీ రా గడువు పూర్తయిన తరువాత డబ్బులు ఇవ్వాలని మ్యా తరి వెంకటేష్‌ను కోరగా రేపు, మాపు అంటూ తప్పించు కొని తిరుగుతున్నాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితు లు తమకు ఇచ్చిన బాండ్లపై ఉన్న చిరునా మాలో ఆరా తీ యగా ఎలాంటి సంస్థ లేదని గుర్తించారు. దీంతో ఆది వారం యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మ్యా తరి వెంకటేష్‌ నారాయణపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాలో రూ.2 కోట్ల మేర బాధితుల నుంచి సేకరించి మోసం చేసినట్లు ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.   

ఆయాన్‌ మృతదేహం లభ్యం 

  • గగన్‌పహాడ్‌ చౌరస్తా సమీపంలో రాళ్లలో గుర్తింపు 

శంషాబాద్‌: వరదలో కొట్టుకుపోయిన మరో మృతదేహం ఆదివారం లభ్యమైంది. వరద నీటిలో కొట్టుకుపోయి మృతిచెందిన ఖరీమాబేగం కుమారుడు ఆయాన్‌(7) మృతదేహం నాలుగురోజులుగా లభ్యం కాలేదు. గగన్‌పహాడ్‌ చౌరస్తా సమీపంలోని సెలబ్రేషన్‌ కన్వెన్షన్‌ దగ్గర రాళ్లలో చిక్కుకుపోయిన మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వరదలో కొట్టుకుపోయిన ఆయాన్‌గా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు