పెళ్లింట విషాదం.. కల్యాణ మండపంలోనే వధువు తండ్రి మృతి

10 Sep, 2022 12:26 IST|Sakshi

సాక్షి, చెన్నై: నెల్లై జిల్లాలో కుమార్తె వివాహం రోజున తండ్రి మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. చేరన్‌ మహాదేవి, నార్త్‌ కారైకురిచ్చి కీల్‌ అగ్రహారానికి చెందిన సుడలైముత్తు (46) కూలీ. ఇతని పెద్ద కుమార్తెకు పదుకుడికి చెందిన యువకుడితో బుధవారం ఉదయం చేరన్‌మహాదేవి బస్‌స్టేషన్‌ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో వివాహం జరిగింది.

వివాహం అయిన రోజు సాయంత్రం సుడలైముత్తు హఠాత్తుగా స్ఫృహతప్పి కింద పడ్డారు. దీంతో బంధువులు అతన్ని చేరన్‌ మహాదేవి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కుమార్తె వివాహం రోజునే తండ్రి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.  
చదవండి: Viral Video: అదృష్టం బాగుండి బతికిపోయాడు.. లేకుంటే ఎంత ఘోరం జరిగుండేది

మరిన్ని వార్తలు