ఇంట్లో సోదరిపై అఘాయిత్యం.. పలుమార్లు అబార్షన్‌ చేపించి..

4 Aug, 2022 04:16 IST|Sakshi

తిరువొత్తియూరు: వావివరుసలు మరచి ఓ వ్యక్తి.. తన చెల్లెల్లిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో పలుమార్లు అబార్షన్‌ చేపించి ఆమె మృతికి కారణమయ్యాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం..సేలం జిల్లా కడయాంబట్టి తాలూకా మేల్‌కొంబై ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతోంది. గత 2018లో ఆ యువతి గర్భిణి అయింది. దీంతో యువతి అన్న హరీష్‌ నాట్టుపట్టిలో ఉన్న సుల్తానా అనే నకిలీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లి అబార్షన్‌ చేయించాడు. అది వికటించడంతో యువతి సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా, 10 రోజుల తరువాత పరిస్థితి విషమించి చనిపోయింది. 

దీనిపై తీవెట్టి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా యువతి గర్భిణి కావడానికి కారణం ఆమె అన్న హరీష్‌ అని తేలింది. గత రెండేళ్లుగా ఇంట్లోనే చెల్లెలితో సన్నిహితంగా మెలగడంతో ఆమె పలుమార్లు గర్భిణి అవడం, వెంటనే అబార్షన్‌ చేయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో మరోమారు గర్భిణి కావడంతో నకిలీ డాక్టర్‌ సుల్తానా చేసిన అబార్షన్‌ ఫలించకపోవడంతో యువతి మృతి చెందింది. దీంతో పోలీసులు నకిలీ డాక్టర్‌ సుల్తానా, హరీష్‌ను అరెస్టు చేయగా, సేలం కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో బెయిల్‌పై వచ్చిన హరీష్‌ బుధవారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  

ఇది కూడా చదవండి: భర్త అలా చేశాడని.. చిర్రెత్తిన భార్య.. 

మరిన్ని వార్తలు