ప్రగతి భవన్‌ వద్ద అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం

8 Jun, 2021 14:13 IST|Sakshi

హైదరాబాద్‌: తమను పేట్‌బషీర్‌బాగ్‌ సీఐ వేధిస్తున్నాడంటూ ఓ కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం చేశారు. అది కూడా ప్రగతి భవన్‌ వద్ద వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒకరు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, మరొకరు మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌కు అడ్డంగా పడిపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఒక బిల్డర్‌తో కుమ్మక్కైన పేట్‌బషీర్‌బాగ్‌ సీఐ తమను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ప్రగతి భవన్‌ వద్ద కలకలం రేపింది. కాగా, చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఆ అన్నదమ్ముల ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు