పాక్‌కు భారత రహస్యాలు చేరవేస్తున్న కానిస్టేబుల్‌ అరెస్టు

25 Oct, 2021 21:23 IST|Sakshi

న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు భారత్‌ భద్రత పరమైన విషయాలను చేరవేస్తున్న ఒక బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ (ఏటీఎస్‌)పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా, జమ్ముకశ్మీర్‌ రాజౌరీకి చెందిన మహమ్మద్‌ సజ్జద్‌ అనే వ్యక్తి బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా భారత్‌ భద్రతపర రహస్యాలను ఫోన్‌ మెసెజ్‌ ద్వారా పాక్‌కు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

నిందితుడు బీఎస్‌ఎఫ్‌లో చేరక ముందు 46 రోజులు పాక్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతను డబ్బుల కోసం భారత్‌ సున్నిత అంశాలను దాయాది పాక్‌కు చేరవేస్తున్నాడని ఏటీఎస్‌ డిప్యూటి ఎస్పీ చవ్‌దా తెలిపారు. 

చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య..

మరిన్ని వార్తలు