జవాన్లకు తప్పిన పెను ప్రమాదం

25 Feb, 2021 08:39 IST|Sakshi
జవాన్లు గుర్తించిన డంప్‌, మావోయిస్టుల సామగ్రి

భువనేశ్వర్‌ : బీఎస్‌ఎఫ్‌ జవాన్లు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జిల్లాలోని చిత్రకొండ సమితి హంతళ్‌గుడ బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌ 9వ బెటాలియన్‌కు చెందిన 20 మంది జవాన్లను టార్గెట్‌ చేస్తూ కొదలిగుడ అటవీప్రాంతంలో మావోలు అమర్చిన బాంబులను జవాన్లు మంగళవారం గుర్తించారు. కొధలిగుడ అటవీప్రాంతంలో సోమవారం రాత్రి కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఈ డంప్‌ను గుర్తించినట్లు జవాన్లు తెలిపారు. ఇదే ప్రాంతంలో మవోలు సమావేశం అయినట్లు ముందస్తు సమాచారం అందడంతో జవాన్లు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

జవాన్ల రాకను గుర్తించిన మావోలు అక్కడ నుంచి పరారయ్యారు. జవాన్లు ఒక బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఐఈడీ బాంబులు, కుక్కర్‌ బాంబు, టిఫిన్‌ బాక్స్‌ బాంబు, మందులు, ఇతర సామగ్రిని గుర్తించారు. ఈ వారంలో డంప్‌ స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. చిత్రకొండ సమీపంలో ఇటీవల మావోలు అమర్చిన మందు పాత్ర పేలి పలువురు జవాన్లకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు