గుజరాత్‌లో విషాదం: ముగ్గురు మృతి

29 Sep, 2020 06:27 IST|Sakshi

గాంధీనగర్: గుజరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. రాష్టంలోని వడోదర జిల్లా బవమన్‌పురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సోమవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందకున్న స్థానిక పోలీసులు, రెస్కూ టీం ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద స్థలిలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు