మద్యం మత్తులో.. తుపాకీతో మహిళ హల్‌చల్‌

24 Nov, 2020 15:23 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుర్ఖా ధరించి చేతిలో తుపాకీ పట్టుకుని ఓ షాపు యజమానిని బండ బూతులు తిడుతూ.. గాల్లోకి కాల్పులు జరిపి ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. ఇక సదరు యువతిని జఫ్రబాద్‌కు చెందిన నుస్రత్‌గా గుర్తించారు. ఇక ఈ సంఘటన ఈశాన్య ఢిల్లీలోని చౌహాన్‌ బంగ్రా ప్రాంతంలో ఈ నెల 18న చోటు చేసుకుంది. నుస్రత్‌కి, ఓ షాపు యజమానికి మధ్య మొబైల్‌ ఫోన్‌కు సంబంధించి వివాదం తలెత్తింది. అప్పటికే మద్యం సేవించి ఉన్న నుస్రత్‌ షాపు యజమానిని అసభ్యకరంగా తిడుతూ.. గన్‌తో బెదిరించడమే కాక అతని షాపు బయట కాల్పులు కూడా జరిపింది. (చదవండి: రాత్రి చితక్కొట్టి: పొద్దున అల్లుడ్ని చేసుకున్నారు)

అంతేకాక తాను గ్యాంగ్‌స్టర్‌ నసీర్‌ సోదరినని తెలిపింది. మహిళ చర్యలతో అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఈ వీడియో ఇండియాటుడేలో ప్రసారం అయ్యింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా