ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి పరిస్థితి విషమం

27 Oct, 2021 17:17 IST|Sakshi

ముంబై: ముంబైలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదర్‌ ప్రాంతంలో.. బస్సు,ట్రక్‌ను ఢీకొన్న ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రులను స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, తీవ్రంగా గాయపడిన వారిలో.. రాజేంద్ర (53), కాశీరామ్‌ ధూరీ (57), తాహిర్‌ హుస్సెన్‌ (52), రూపాలి గైక్వాడ్‌ (36), సుల్తాన్‌ (50), శ్రావణి మోస్కీ (16), వైధేహి బామనీ (17), మాన్సూర్‌ ఆలీ (52) తదితరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తేజస్వినీ ట్రావెల్‌ కు చెందిన బస్సు మారోల్‌ నుంచి పైడోనీకి వెళ్తుండగా దాదార్‌ వద్ద ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం.. డ్రైవర్‌ కండక్టర్‌తో సహా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

చదవండి: పంజాబ్‌లో మారనున్న రాజకీయ సమీకరణాలు

మరిన్ని వార్తలు