Karimnagar: రూ. 10 కోట్లతో వ్యాపారి అదృశ్యం

2 Oct, 2021 08:50 IST|Sakshi
ఠాణా ఎదుట బాధితులు

సాక్షి, జగిత్యాల (కరీంనగర్‌): అధిక వడ్డీ ఆశచూపి, పలువురి నుంచి రూ.10 కోట్ల వరకు అప్పు తీసుకున్న ఓ వ్యాపారి పరారయ్యాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జగిత్యాల పోచమ్మవాడకు చెందిన ఓ వ్యాపారి జిల్లా కేంద్రానికి చెందిన సుమారు 80 నుంచి 95 మంది వద్ద రూ.10 కోట్లు, రెండున్నర కిలోల బంగారం తీసుకున్నాడు. కొంతకాలం వడ్డీ చెల్లించాడు. గత వారం రోజులుగా కనిపించక పోవడంతో శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు.

అధికారులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో బాధితులందరూ అక్కడికివెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా సదరు వ్యాపారి గతంలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు పెంచుకొని, జిల్లా వ్యాప్తంగా పెట్టుబడుల పేరుతో సుమారు రూ.22 కోట్ల వరకు అప్పు తీసుకున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఓ బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. 

చదవండి: చేనుపనులు ముగించుకుని వస్తున్నాడు.. అంతలోనే

మరిన్ని వార్తలు