ఆన్‌లైన్‌ గేమ్స్‌కు సీఏ విద్యార్థి బలి

29 Dec, 2020 10:09 IST|Sakshi

మంచిర్యాలక్రైం: ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడిన ఓ విద్యార్థి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజమౌళిగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... నస్పూర్‌కు చెందిన రవి–లలిత దంపతుల రెండో కుమారుడు అభిలాష్‌ (25) సీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దనే ఉండడంతో సరదాగా ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటుపడ్డాడు. తర్వాత సరదా కాస్త..వ్యసనంగా మారి అప్పుల పాలై బలవంతంగా తనువు చాలించాడు.  హైదరాబాద్‌ వెళ్తున్నాని ఇంట్లో నుంచి  వెళ్లి పోయిన అభిలాష్‌ ఈ నెల 27న స్థానిక తోళ్లవాగు శివారులో పురుగుల మందు తాగి పడి ఉన్నాడు.

అటువైపు వెళ్లిన వారు అభిలాష్‌ను గమనించి దగ్గరికి వెళ్లి చూడగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. అభిలాష్‌ సెల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో తన చేతిపై ఉన్న ఓ సెల్‌ నంబర్‌కు సమాచారం అందించారు. అది అభిలాష్‌ అన్నయ్య ఆకాష్‌ది కావడంతో వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు  పేర్కొన్నారు.   (రాచకొండలో 12 శాతం తగ్గిన క్రైమ్‌ రేట్‌ )

మరిన్ని వార్తలు