యువతిపై క్యాబ్‌ డ్రైవర్‌ లైంగికదాడి!.. నిందితుని వాదన మరోలా

23 Sep, 2021 01:02 IST|Sakshi

బెంగళూరులో ఘటన

సాక్షి, బొమ్మనహళ్లి: బెంగళూరులో ప్రైవేటు సంస్థ ఉద్యోగినిపై ఒక క్యాబ్‌ డ్రైవర్‌ లైంగికదాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. నిందితుడు దేవరాజును పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం బెంగళూరు నగర అదనపు పోలీస్‌ కమిషనర్‌ మురుగన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర భారత ప్రాంతానికి చెందిన యువతి మురుగేష్‌ పాళ్యలో నివాసంఉంటూ ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోంది.

హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో స్నేహితురాలి ఇంట్లో పార్టీ చేసుకుని బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన రూంకు వెళ్ళడానికి క్యాబ్‌ను బుక్‌ చేసుకుంది. ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌ దేవరాజు వచ్చి యువతిని తీసుకెళ్లాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో యువతి ఇంటికి సమీపంలో కారును నిలిపి అత్యాచారం చేశాడని ఆమె జీవనబీమా నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నిందితుని వాదన మరోలా ఉంది. తాను అలాంటి వాడిని కాదని, క్యాబ్‌లో ఎక్కడానికి ముందు ఆమె మద్యం మత్తులో ఉందని, ఇల్లు వచ్చింది, దిగమని చెప్పినా ఆమె పట్టించుకోలేదన్నాడు. తానే కారులో నుంచి బయటికి దించానని, కారు కిరాయి కూడా ఇవ్వలేదని, తిరిగి తనపైనే ఫిర్యాదు చేశారని నిందితుడు విచారణలో చెప్పాడు. 

మరిన్ని వార్తలు