కత్తులతో రెచ్చిపోయిన దుండగులు.. 10 మందిని హత్య చేసి పరార్..

5 Sep, 2022 12:00 IST|Sakshi

ఒట్టావా: కెనడాలో ఇద్దరు దుండగులు కత్తులలో రెచ్చిపోయారు. సంప్రదాయ తెగలు నివసించే ప్రాంతాలే లక్ష‍్యంగా విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. కన్పించిన వారినళ్లా పొడుచుకుంటూ వెళ్లారు. మొత్తం రెండు ప్రాంతాల్లో 13 చోట్ల విధ్వంసం సృష్టించారు. ఈ మారణకాండలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు.

కెనడా చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి దారుణ ఘటన జరగలేదు. అమెరికాలో మాత్రమే తరచూ మాస్ షూటింగ్‌లు, హత్యలు జరగుతుంటాయి. ఈ ఘటనపై కెనడా ప్రధాని ట్రుడో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన హృదయం ముక్కలైందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరోవైపు ఇద్దరు నిందుతులు డెమియన్‌ సాండర్సన్(31), మైల్స్ సాండర్సన్‌(30) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. వీరి ఫోటోలను కూడా విడుల చేశారు. అయితే నిందితులు ఏ కారణంతో దాడి చేసి ఉంటారనే విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టడం  లేదు.

మృతులంతా జేమ్స్ స్మిత్ క్రీ నేషన్, వెల్డన్‌ గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. జేమ్స్ స్మిత్ క్రీ నేషన్‍లో 3,400 మంది మాత్రమే నివసిస్తారు. వ్యవసాయం, వేట, చేపలు పట్టడమే వీరి వృత్తి. వెల్డన్‌లో 200మంది మాత్రమే జీవిస్తారు. ఈ ప్రాంతాల్లో ఎవరినో లక్ష‍్యంగా చేసుకునే దుండృగులు ఈ కిరాతక చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు.
చదవండి: మనం మళ్లీ పిల్లల్లా మారిపోతే! శాస్త్రవేత్తల అధునాతన ‍ప్రయోగం

మరిన్ని వార్తలు