ఆయుర్వేద మెడిసిన్‌ పేరిట అమెజాన్‌ ద్వారా భారీగా గంజాయి రవాణా 

28 Nov, 2021 10:00 IST|Sakshi
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఈబీ జేడీ సతీష్‌కుమార్‌

విశాఖ ఏజెన్సీ నుంచి మధ్యప్రదేశ్, రాజస్తాన్‌కు సరఫరా

7 నెలలుగా అమెజాన్‌ ద్వారా 900 కిలోల రవాణా

మొత్తం ఐదుగురు అరెస్టు

విశాఖకు చెందిన శ్రీనివాసరావే కీలక సూత్రధారి

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జేడీ సతీష్‌కుమార్‌

సాక్షి, విశాఖపట్నం: అమెజాన్‌ ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌ ద్వారా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను విశాఖ ఎస్‌ఈబీ అధికారులు అరెస్టు చేశారు. డయాబెటీస్‌ వ్యాధి నివారణకు తయారయ్యే ఆయుర్వేద మెడిసిన్‌లో వాడే ‘సూపర్‌ నేచురల్‌ స్టేవియా లీవ్స్‌’ పేరిట రవాణా చేస్తున్న ఐదుగురు ముఠాను అరెస్టు చేసినట్లు  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జేడీ సతీష్‌కుమార్‌ వెల్లడించారు.

చదవండి: రాయలచెరువుకు తప్పిన ముప్పు.. వారం తర్వాత ఇంటికెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మీడియాకి వెల్లడించారు. గత ఏడు లేదా ఎనిమిది నెలల నుంచి అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని సుమారుగా 900 కేజీల గంజాయి రవాణా చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విశాఖకు చెందిన ఐదుగురు వ్యక్తులను విశాఖ ఎస్‌ఈబీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించామని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.  

ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు
అమెజాన్‌ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా గంజాయి రవాణా జరుగుతుందని మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఈనెల 21వ తేదీన కంచరపాలెంకు చెందిన చిలకపాటి శ్రీనివాసరావు ఇంటిలో తనిఖీలు నిర్వహించామని సతీష్‌కుమార్‌ తెలిపారు. ఇంటిలో 48 కేజీల డ్రై గంజాయితో పాటు ఓ ఎలక్ట్రానిక్‌ వెయిట్‌మిషన్, గంజాయి ప్యాకెట్లకు ఉపయోగించే రెండు కార్డ్‌ బోర్డు బాక్స్‌లు, అమెజాన్‌ బ్లాక్‌ అండ్‌ గ్రే కలర్‌ పాలిథీన్‌ బ్యాగ్స్, అమెజాన్‌ టేప్స్‌ దొరికాయని చెప్పారు.

శ్రీనివాసరావుని అరెస్టు చేసి విచారించగా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన సురజ్‌ పావయ్య, ముకుల్‌ జైశ్వాల్‌ ఇద్దరూ ‘సూపర్‌ నేచురల్‌ స్టేవియా లీవ్స్‌’ పేరిట అమెజాన్‌ యాప్‌లో బుక్‌ చేసినట్లు చెప్పాడని తెలిపారు. చిలకపాటి శ్రీనివాసరావు కుమారుడు చిలకపాటి మోహన్‌రాజు, అమెజాన్‌ పికప్‌ బాయ్స్‌ కుమారస్వామి, కృష్ణంరాజు, డ్రైవర్‌ వెంకటేశ్వర్లును అరెస్టు చేశామని సతీష్‌కుమార్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు