బంజారాహిల్స్‌లో బెంజ్‌ కారు బీభత్సం

22 Nov, 2020 07:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన బెంజ్‌ కారు ఇండికా కారును ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇండికాలో ఉ‍న్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. సమీపంలో ఉ‍న్న ఓ పబ్‌లో మద్యం తాగిన మందుబాబులు.. బెంజ్‌ కారులో వేగంగా రోడ్డుపైకి దూసుకొచ్చారు. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బెంజ్‌ కారులో ముగ్గురు యువకులు, ఒక యువతి ఉ‍న్నట్లు గుర్తించారు. కారు నడిపిన హార్దిక్‌ రెడ్డి, అఖిల్‌ ప్రమోద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  (ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. క్షణాల్లో)

కాగా.. బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 3 వద్ద ఉన్న రాయల్ టిఫిన్ సెంటర్ డేంజర్ స్పాట్ గా మారింది. అక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుకుంటున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు