వనస్థలిపురంలో కారు బీభత్సం, సీసీటీవీ దృశ్యాలు

27 Feb, 2021 13:24 IST|Sakshi

ఒకరు మృతి.. పరారీలో మరో యువకుడు

సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. యువకుడు మద్యం మత్తులో కారు డ్రైవ్‌ చేయడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. గౌతమ్‌ అనే యువకుడు తన స్నేహితులు ఇద్దరితో కలిసి సాగర్‌ రోడ్‌ నుంచి ఇబ్రహీం పట్నం వెళ్తున్నాడు. అప్పటికే అతడు మద్యం సేవించి ఉన్నాడు. ఈ క్రమంలో హస్తినాపురంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు (నెంబర్‌: TS05FH2356)) డివైడర్ పై నుంచి మరో పక్కకి దూసుకెళ్లింది.

గౌతమ్‌తో పాటు కారులో వెనకాల సీట్‌లో కూర్చున్న అతడి స్నేహితుడు సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే మరో స్నేహితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఇక యాక్సిడెంట్‌ చేసిన గౌతమ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు