విషాదం: పెళ్లి చూపులకు వెళ్లొస్తూ..

29 Jun, 2021 08:33 IST|Sakshi

సాక్షి, వేలూరు(తమిళనాడు): పెళ్లి సంబంధానికి వెళ్లి వస్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాధం నింపింది. వివరాలు.. చెన్నై నందనం నగర్‌కు చెందిన చంద్ర మౌళి ఇతని భార్య వసుందర దేవి(45), కుమారుడు వేణుగోపాల్‌(26) ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. వేణుగోపాల్‌కు పెళ్లి సంబందం చూసేందుకు చెన్నై నుంచి హోసూరుకు ఆదివారం బయలుదేరారు. రాణిపేటలో చంద్ర మౌళి తండ్రి కన్నయన్‌(94) ఉండటంతో అతన్ని కూడా తీసుకొని హోసూరుకు వెళ్లారు. అక్కడ సంబంధం కుదుర్చుకొని అదేకారులో సాయంత్రం చెన్నైకి బయలుదేరారు. కారును వేణుగోపాల్‌ నడుపుతున్నాడు.

కారు తిరుపత్తూరు జిల్లా సెంగిలికుప్పం వద్ద హైవే వస్తూ.. ముందు వెళ్తున్న లారీని అదుపుతప్పి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం  నుజ్జునుజ్జు కావడంతో కారులోని కొత్త పెళ్లి కుమారుడు వేణుగోపాల్, తాత కన్నయ్యన్‌ అక్కడిక్కడే మృతి చెందగా చంద్రమౌళి, ఆయన భార్య వసుందర దేవికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఇతర వాహనదారులు పోలీసుల సాయంతో ఆంబూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మార్గంమధ్యలో వసుందర దేవి మృతి చెందింది. చంద్రమౌళి పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరులోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఆంబూరు తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: వ్యాక్సిన్‌ వ్యతిరేక ట్వీట్లు.. ధీటైన రిప్లై.. షాకిచ్చిన ట్విటర్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు