కుక్కను తప్పించబోయి అదుపుతప్పిన కారు.. ఒకరి మృతి.. మరో ముగ్గురు

10 Dec, 2021 09:01 IST|Sakshi
ప్రమాదానికి గురైన కారు

సాక్షి, ఘట్‌కేసర్‌(హైదరాబాద్‌): కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పిన సంఘటనలో ఓ విద్యార్థి  అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఘట్‌కేసర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. మక్తకు చెందిన విద్యార్థి సిద్దగోని అఖిల్‌ (19), కొర్ర విశాల్‌ (15), కొర్రెముల్‌కు చెందిన విద్యార్థి షఫీ (20), బడుగుల సురేశ్‌ (19) బుధవారం అర్ధరాత్రి ఇన్నోవా వాహనంలో ప్రతాపసింగారం చౌరస్తా నుండి కొర్రెముల్‌కు వెళుతున్నారు.

ఐమాత ఆలయం సమీపంలో ఓ కుక్క కారుకు అడ్డుగా వచ్చింది. కుక్కను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు  పక్కనున్న వెంచర్‌లో పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలైన సిద్దగోని అఖిల్‌ అక్కడికక్కడే మృతి చెందగా వాహనం నడుపుతున్న షఫీ తలకు దెబ్బతగిలింది. మిగిలిన ఇద్దరికి సాధారణ గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు  తెలిపారు. 

చదవండి: 2 ఆస్పత్రుల్లో 2 సర్జరీలు.. మృతదేహానికి పోస్టుమార్టం!

మరిన్ని వార్తలు