పండుగరోజు విషాదం: చెల్లితో రాఖీ కట్టించుకోకుండానే...

23 Aug, 2021 08:16 IST|Sakshi
రాకేశ్‌(ఫైల్‌)

సాక్షి, జమ్మికుంట(కరీంనగర్‌): జమ్మికుంట పురపాలక సంఘం పరిధి రామన్నపల్లి గ్రామానికి చెందిన వెలిపికొండ రాకేశ్‌(25) పండుగపూట మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఆదివారం రాకేశ్‌ కారులో బంధువులను సుల్తాన్‌బాద్‌లో దించి తిరిగి ఇంటికి వస్తుండగా ఓదెల మండలం కనగర్తి గ్రామ శివారులో కారు చెట్టును ఢీకొని చెరువులోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో రాకేశ్‌ మృతిచెందాడు. రాకేశ్‌ స్వగ్రామం హూజూరాబాద్‌ మండలం సిరిసపల్లి గ్రామం. అతడి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మృతి చెందగా అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. రాకేశ్‌ మృతి విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి ఒక చెల్లె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.  

చదవండి: తాలిబన్ల దమనకాండ

మరిన్ని వార్తలు