గగుర్పాటు గొలిపే ఘోర ప్రమాదం

12 Oct, 2020 13:44 IST|Sakshi

రెండు బైకులు, రెండు కార్లను ఢీకొట్టిన కారు

ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి

సాక్షి, భువనగిరి‌: హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ సమీపంలో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి వరుసగా రెండు బైకులు, రెండు కార్లని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా... ఓ స్కూటీ పూర్తిగా దగ్దమయ్యి౦ది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. అందులో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారు బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్ది సేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ప్రేమ పెళ్లికని వెళ్తుండగా..
మృతుడు నాగరాజు  హయత్‌నగర్‌ చెందిన వాడిగా తెలిసింది. శ్రీలత అనే యువతితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నాగరాజు.. ఆమెను ప్రేమ పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఈక్రమంలో ప్రేమికులిద్దరు చెరువుగట్టు వద్ద వివాహం చేసుకునేందుకు వెళ్తుండగా ప్రమాదానికి గురై అనూహ్యంగా ప్రాణాలు విడిచారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుదామనుకున్న శ్రీలత, నాగరాజు అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 
(చదవండి: అనుమానం: భార్యతోపాటు మరో మహిళ దారుణ హత్య)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు