రివర్స్‌ తీస్తుండగా.. ఒక్కసారిగా జనంపైకి దూసుకెళ్లిన కారు

17 Oct, 2021 13:35 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో దసరా వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత విగ్రహాల నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఓ కారు జనాలపైకి దూసుకేళ్లింది. ఈ ఘటన శనివారం భోపాల్‌లోని బజారియా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారకుడైన కారు డ్రైవర్‌ను పట్టుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.

కారును రివర్స్‌ తీసే క్రమంలో వేగం అదుపు తప్పి జనంపైకి దూసికేళ్లింది. ఈ ఘటనలో గాయపడిన ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భోపాల్‌ డీఐజీ ఇర్షాద్ వలీ మాట్లాడుతూ.. కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి, కారును సీజ్‌ చేశామని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు