బీడీ ముట్టించుకుంటుండగా మంటలు 

7 Dec, 2021 07:17 IST|Sakshi

సాక్షి, జవహర్‌నగర్‌(హైదరాబాద్‌): బీడీ ముట్టించుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని వృద్ధుడు సజీవ దహనమైన సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం... కార్పొరేషన్‌లోని ఆనంద్‌నగర్‌ కాలనీలో శ్రావణ్‌కుమార్‌ (79) కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.

బీడీ తాగే అలవాటు ఉన్న శ్రావణ్‌కుమార్‌ బీడీ అంటించుకునే సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని సజీవదహనమయ్యాడు. కుటుంబ సభ్యులు చూసి తేరుకునే లోపే అతడు పూర్తిగా కాలిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు