సహజీవనం చేసి.. తల్లిని చేశాడు.. ఆస్తిలో భాగం కావాలి.. తర్వాత ఏం జరిగిందంటే?

1 Jun, 2022 16:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గోరంట్ల(శ్రీసత్యసాయి జిల్లా): మహిళను మోసగించిన ఓ వ్యక్తిపై మండల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ సుబ్బారాయుడు తెలిపిన మేరకు.. గోరంట్లకు చెందిన ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌ గతేడాది మేలో మృతి చెందారు. ఈయన మరణించిన కొన్నిరోజులకే.. తనతో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లిని చేశాడంటూ మండలంలోని కరావులపల్లికి చెందిన సంధ్యాబాయి ప్రభాకర్‌ భార్య రుక్మిణీదేవితో వచ్చి వాపోయింది.
చదవండి: బాలుడు పాడుపని.. ఇంటర్‌ బాలికను ఇంటికి తీసుకెళ్లి..

ఆస్తిలో తనకూ భాగం కావాలని వాగ్వాదానికి దిగి ప్రభాకర్‌కు చెందిన ఒక ఇంట్లో దిగింది. ఆమెను ఎలాగైనా ఇంటి నుంచి ఖాళీ చేయిస్తానని అయితే, తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని గోరంట్లకు చెందిన గాండ్ల జగన్‌ చెప్పడంతో రుక్మిణీదేవి ఆ మేరకు డబ్బు  అందజేసింది. ఎన్నిరోజులైనా సమస్యను పరిష్కరించకపోవడంతో డబ్బు వెనక్కివ్వాలని గాండ్ల జగన్‌ను మంగళవారం రుక్మిణీ దేవి నిలదీసింది. ఆయన బెదిరింపులకు దిగడంతో పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు జగన్‌పై ఐపీసీ 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు