కీచక టీచర్‌.. పాఠాలు పక్కన పెట్టి ఒంటరిగా ఉండే విద్యార్థినులతో..

28 Apr, 2022 17:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,నర్సింహులపేట(ములుగు): మంచి విద్యాబుద్ధులు చెప్పి విజ్ఞానవంతులుగా చేయాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థునుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వక్రమార్గంగా మాట్లాడం చేసేవాడు. సహించలేని విద్యార్థునులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, విద్యార్థినుల తల్లిదండ్రుల కథనం ప్రకారం.. తొర్రూర్‌ మండలం కొండాపూర్‌కు చెందిన మహేందర్‌ అనే ఉపాధ్యాయుడు దాట్ల హైస్కూల్‌లో సాంఘిక శాస్త్రం బోధిస్తున్నాడు. పీఈటీగా కూడా విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇస్తుంటాడు.

గ్రామంలోనే ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. సదరు ఉపాధ్యాయుడు కొన్ని రోజులుగా పదవ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఎవరూ లేని సమయంలో వారిని వేధింపులకు గురిచేయడం, వక్రమార్గంలో మాట్లాడడం చేస్తున్నాడు. అతని ప్రవర్తనతో విసుగుచెందిన కొందరు విద్యార్థినులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఆగ్రహంతో బుధవారం అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు మహేందర్‌పై పోక్సో, ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ మురళీధర్‌ రాజు తెలిపారు.

చదవండి: ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.. తీరా గర్భిణి అయ్యాక..

మరిన్ని వార్తలు