జగిత్యాల: తల్వార్‌తో బర్త్‌డే వేడుకలు

3 May, 2021 11:05 IST|Sakshi

జగిత్యాలక్రైం: పుట్టిన రోజు వేడుకలను తల్వార్‌తో జరుపుకున్న మైనర్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హన్‌మాన్‌వాడకు చెందిన 17 ఏళ్ల మైనర్‌ తన పుట్టిన రోజు వేడుకలను శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత స్నేహితుల మధ్య రోడ్డుపైన జరుపుకున్నాడు. తల్వార్‌తో కేక్‌ కట్‌ చేయడంతోపాటు నృత్యాలు చేశారు.

ఆ దృశ్యాలు పోలీసుల వరకు వెళ్లడంతో సదరు మైనర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జయేశ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారు చేసే పనులపై ఓ కన్నేసి ఉంచాలని, సంఘ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడితే తల్లిదండ్రులపై సైతం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

చదవండి: అయ్యో కొడుకా: తండ్రి ట్రాక్టర్‌ కింద పడి..

మరిన్ని వార్తలు