పెళ్లి చేసుకోను.. దిక్కున్న చోట చెప్పుకో..

27 Sep, 2020 20:39 IST|Sakshi

సాక్షి, జయశంకర్‌ : ప్రేమ, పెళ్లి పేరుతో ఓ ఆర్మీ జవాను యువతిని మోసం చేశాడు. నమ్మి వచ్చిన అమ్మాయిని కాదని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ ఘటన టేకుమట్ల మండల కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. టేకుమట్లకు చెందిన ఆర్మీ జవాన్ కొలుగూరి కార్తీక్ తన బంధువైన రేగొండ మండలం జగ్గయ్య పేట గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. శారీరకంగా కూడా లొంగదీసుకున్నాడు. దాదాపు ఆరేళ్లు గడుస్తున్నా పెళ్లి ఊసెత్తలేదు. చివరకు ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ముఖం చాటేశాడు. ( తండ్రిని చంపి, పొలంలో పాతిపెట్టి..)

‘‘పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదు.. నీకు దిక్కున్న చోట చెప్పుకో’’ అని బెదిరించాడు. అంతేకాకుండా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో సదరు యువతి ప్రియుడి ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. కార్తీక్‌తో పెళ్లి జరగక పోతే ఆత్మహత్య చేసుకుంటానని టేకుమట్ల పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు