ఎంపీ అరవింద్‌పై కేసు నమోదు

25 Nov, 2020 10:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ సమీపంలో టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను చించివేసిన ఘటనకు సంబంధించి ఆయనపై 504, 506, 427 సె​క్షన్ల కింద  బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ అరవింద్‌తో పాటు కార్యకర్తలపైనా కేసు నమోదు అయింది.

మార్పుకు నాంది పలకండి..
సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌లో ఉంటూ పాలన సాగిస్తున్నారని ఎంపీ అరవింద్‌ దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్థి విజయదుర్గ సందీప్‌ యాదవ్‌కు మద్దతుగా ఆయన నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో మూతపడటం ఖాయమన్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, దుబ్బాక ఎన్నికల్లో ఎలా నిజాయితీకి ఓటు వేశారో అలానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓటువేసి మార్పుకు నాంది పలకాలని ఎంపీ అరవింద్‌ కోరారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా