భర్తలేని సమయంలో మహిళా సీఐ ఇంట్లో మరో​ సీఐ.. అసలేం జరిగింది?

4 Oct, 2022 13:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వరంగల్‌ క్రైం: వరంగల్‌ సీఐడీ విభాగంలో పనిచేస్తున్న ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌పై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. ఈ విషయం కమిషనరేట్‌లో సంచలనం కలిగించింది. సుబేదారి సీఐ షుకుర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సీఐడీలో పనిచేస్తున్న ఓ మహిళా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ హనుమకొండ రాంనగర్‌లో ఉంటోంది. ఆమె భర్త రవికుమార్‌ మహబూబాబాద్‌ రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు.
చదవండి: కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని..

సోమవారం మధ్యాహ్నం వరంగల్‌ సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ బాల రవి.. రాంనగర్‌లోని మహిళా ఇన్‌స్పెక్టర్‌ ఇంటికి ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లాడు. ఆమె భర్త రవికుమార్‌ తన ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న బాల రవిని చూసి ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. బాల రవి తిరిగి రవికుమార్‌ను బెదిరించాడు. దీంతో తాను లేని సమయంలో, భార్య ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ బాల రవిపై కేసు నమోదు చేయాలని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాల రవిపై ఐపీసీ 448, 506 సెక్షన్‌ల కింది కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ విషయం పోలీస్‌శాఖలో పెద్దఎత్తున చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు