ప్రముఖ న్యూస్‌ చానల్‌ విలేకరినంటూ..

7 Sep, 2021 08:45 IST|Sakshi

నకిలీ విలేకరిపై కేసు నమోదు 

ఓడీ చెరువు(అనంతపురం జిల్లా): టీవీ రిపోర్టర్‌గా చెప్పుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న యువకుడిపై ఓడీ చెరువు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ గోపి తెలిపిన మేరకు.. గత నెల 24న మహేంద్రనాయక్‌ అనే యువకుడు తాను ఓ ప్రముఖ న్యూస్‌ చానల్‌ విలేకరినంటూ ఓడీ చెరువు మండలం కొండకమర్ల ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు టీ భాస్కర్‌ను కలిసి పరిచయం చేసుకున్నాడు.

ఆ పాఠశాలలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న జయలక్ష్మికి సంబంధించిన అనుమతుల పత్రాల నకళ్లు కావాలని అడిగాడు. తప్పుడు విధానంలో ఆమెను ఎంపిక చేశారని, తనకు డబ్బు ఇస్తే ఈ విషయం వెలుగు చూడకుండా ఉంటుందని, లేకపోతే తమ న్యూస్‌ చానల్‌లో ప్రసారం చేస్తానంటూ బెదిరించాడు. ఈ విషయంగా ఆ న్యూస్‌ చానల్‌ ప్రతినిధులతో భాస్కర్‌ నేరుగా మాట్లాడి, అతను నకిలీ అని ధ్రువీకరించుకుని, పుట్టపర్తి డివిజన్‌ న్యూస్‌ చానల్‌ ప్రతినిధి కేశవతో కలిసి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:
ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..!  
ప్రియుడితో సహజీవనం.. చివరికి ఏం జరిగిందంటే?

మరిన్ని వార్తలు