చేటు తెచ్చిన సివిల్‌ పంచాయితీ

21 Aug, 2020 10:57 IST|Sakshi

రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు 

సీఐపై బదిలీ, ఆపై సస్పెన్షన్‌

ఒంగోలు: సివిల్‌ వ్యవహారం చేటు తెచ్చింది. ఇందుకు కారకులుగా భావిస్తూ విశ్రాంత పోలీసు అధికారి ఒకరిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయగా కేసు విచారించిన సీఐపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీనికి సంబంధించి ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. పోలీసు శాఖలో అదనపు ఎస్పీగా పనిచేసి రిటైర్‌ అయిన నరహరి.. దాసరి మాల్యాద్రి అనే వ్యక్తికి కొంత మొత్తం అప్పుగా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈనెల 18న మాల్యాద్రి కుమారుడ్ని ఒంగోలు రైల్వేస్టేషన్‌ వద్దకు పిలిపించారు. అక్కడ నుంచి కారులో రామాయపట్నంకు చేరుకుని ఆయన తండ్రి మాల్యాద్రితో నేరుగా తాలూకా పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. నరహరి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐ లక్ష్మణ్‌ ఇరువర్గాలతో మాట్లాడారు. ఈ క్రమంలో ఇప్పుడే వస్తానంటూ 

బయటకు వెళ్లిన మాల్యాద్రి తిరిగి రాలేదు. దీంతో అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఉదయాన్నే మాల్యా ద్రి పెళ్లూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై మృతదే హమై కనిపించారు. డబ్బులు చెల్లించాలంటూ మాన సికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడంటూ మృతుడి బంధువులు ఎస్పీకి ఐ క్లిక్‌లో ఫిర్యాదు చేశారు. అదే విధంగా గురువారం జీఆర్‌పీ పోలీసులకు శవ పంచనామా సందర్భంగా కూడా నరహరి స్టేషన్‌కు తీసుకువెళ్లి తమను కులం పేరుతో దూషించడం,డబ్బులు ఇవ్వా లంటూ మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడి చేశా రని, ఈ విషయంలో తాలూకా సీఐ లక్ష్మణ్‌ కూడా తమను బెదిరించారంటూ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి శవ పంచనామా అనంతరం లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు జీఆర్‌పీ పోలీసులు బదిలీ చేస్తున్న నేపథ్యంలో ప్రాథమికంగా తాలూకా సీఐ లక్ష్మణ్‌ను వీఆర్‌కు బదిలీ చేసి, సస్పెండ్‌ చేయడంతోబాటు నరహరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. ఎస్పీ సిఫార్సు మేరకు సీఐ లక్ష్మణ్‌ను సస్పెండ్‌ చేస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ జె.ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మణ్‌ మీద వచ్చిన ఆరోపణలపై ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ను విచారణాధికారిగా నియమించారు. 

మరిన్ని వార్తలు