కర్నూలు వన్‌టౌన్‌ పీఎస్‌లో చంద్రబాబుపై కేసు నమోదు

7 May, 2021 18:11 IST|Sakshi

సాక్షి, కర్నూలు: కరోనా కట్టడిపై టీడీపీ అధ్యక్షుడు,ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విషప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై కర్నూలు వన్‌టౌన్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. సీనియర్‌ న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై పోలీసులు కేసును నమోదుచేశారు. కర్నూలు కేంద్రంగా ఎన్‌ 440 అనే స్ట్రెయిన్‌ వ్యాప్తి అనే అభూత కల్పనను చంద్రబాబు సృష్టించారని సుబ్బయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా చంద్రబాబు నాయుడు దుష్ప్రచారంతో పలువురి చావుకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.చంద్రబాబుపై తగుచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు.. చంద్రబాబుపై 188, 505(1)(బి)(2) సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. 

చదవండి: చంద్రబాబు విష ప్రచారాల వల్లే.. ఇదంతా: సజ్జల

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు