సిండికేట్‌ బ్యాంక్‌లో మోసం కేసులో సీబీఐ చార్జ్‌షీట్‌

26 Aug, 2021 03:48 IST|Sakshi

న్యూఢిల్లీ: సిండికేట్‌ బ్యాంకులో జరిగిన రూ.209 కోట్ల మోసం కేసులో వ్యాపారవేత్త అనూప్‌ బర్తియా,  బ్యాంక్‌ మాజీ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (ఏజీఎం) ఆదర్శ్‌ మన్‌చందన్, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) భరత్‌సహా మరో 15 మందిపై సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. జైపూర్‌ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ను సమర్పించింది. రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించి నకిలీ పత్రాలు, ఇన్‌వాయిస్‌లు, వర్క్‌ ఆర్డర్లని వినియోగించి మొత్తం 118 రుణ అకౌంట్లకు రూ.209 కోట్ల నిధులను మళ్లించినట్లు సీబీఐ ఆరోపణ. 118 అకౌంట్లలో గృహ రుణ అకౌంట్లు, టర్మ్‌లోన్‌ అకౌంట్లు ఉన్నాయని ఉన్నతస్థాయి అధికారులు తెలిపారు. కమర్షియల్‌ ప్రాపర్టీల కొనుగోళ్లు, గృహ రుణాలు, ఓవర్‌ డ్రాఫ్ట్‌లు, వర్కింగ్‌ క్యాపిటల్‌ టర్మ్‌లోన్ల పేరుతో అధికారులు కుమ్మక్కై  జైపూర్‌లోని మిరోడ్‌ బ్రాంచ్, మాళవ్య నగర్‌ బ్రాంచ్, ఉదయ్‌ పూర్‌ బ్రాంచీల నుంచి భారీ రుణాలను 118 అకౌంట్లకు మళ్లించినట్లు ప్రధాన ఆరోపణ.  

మరిన్ని వార్తలు